సన్‌రైజర్స్ కొత్త టీం
- January 29, 2018
హైదరాబాద్: ఐపీఎల్ పదకొండో సీజన్‌కు అతి కీలకమైన ఘట్టం ముగిసింది. మ్యాచ్‌లకు మించిన ఉత్కంఠ రేపుతూ.. రెండు రోజుల పాటు సాగిన ఆటగాళ్ల వేలం విజయవంతంగా పూర్తయింది. మెగా లీగ్‌లో తమ సైనికులను ఎంచుకున్న జట్లు కొత్త రూపును సంతరించుకొని రెండో దశాబ్దంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఐపీఎల్లో 2012 నుంచి సన్‌రైజర్స్ ఎక్కువగా బౌలర్లపైనే దృష్టి పెట్టిందని చెప్పవచ్చు. ఐపీఎల్లో బౌలింగ్ నైపుణ్యంతో తనదైన ముద్రవేసిన జట్టుగా సన్‌రైజర్స్‌కు గుర్తింపు ఉంది. అంతేకాక 2016లో ఛాంపియన్‌గా కూడా నిలిచింది. తాజాగా ఐపీఎల్ వేలం పాటలోనూ బౌలర్లనే నమ్ముకుంది ఆ జట్టు. సత్తా ఉన్న ఆటగాళ్ళపైనే దృష్టిసారించిన సన్‌రైజర్స్.. అనుకున్న ఆటగాళ్ళను ఎంపిక చేసుకోవడంలో సఫలమైందని చెప్పవచ్చు.
సన్‌రైజర్స్ పెట్టిన ఖర్చు: రూ.79.35 కోట్లు
జట్టు వద్ద మిగిలిన డబ్బు: రూ.65 లక్షలు
రీటెయిన్డ్: డేవిడ్ వార్నర్ (రూ.12.5 కోట్లు), భువనేశ్వర్ (రూ.8.5 కోట్లు)
రైట్ టు మ్యాచ్: రషీద్‌ఖాన్ (రూ.9 కోట్లు), శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు), దీపక్ హుడా (రూ.3.6 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
వార్నర్ (12.5 కోట్లు), మనీష్ పాండే (11 కోట్లు), రషీద్ (9), భువనేశ్వర్ (8.5),
ధవన్ (5.2), సాహా (5), సిద్ధార్ధ్ కౌల్ (3.8), దీపక్ హుడా (3.6),
ఖలీల్ అహ్మద్ (3), సందీప్ శర్మ (3), కేన్ విలియమ్సన్ (3), బ్రాత్‌వైట్ (2),
షకీబల్ (2), యూసుఫ్ (1.9), శ్రీవత్స గోస్వామి (1), నబీ (1), జోర్డాన్ (1),
బాసిల్ థంపి (0.95 లక్షలు), స్టాన్లేక్ (0.50), టి.నటరాజన్ (0.40),
సచిన్ బేబి (0.20), బిపుల్ శర్మ (0.20) మెహ్ది హసన్ (20),
రికీ భుయ్ (0.20), తన్మయ్ అగర్వాల్ (0.20).
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు