సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ ప్రారంభం త్వరలో
- January 29, 2018
*కేంద్ర సమాచార, ప్రసార శాఖ
అమరావతి : కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకాల అమలు, జిల్లాలో ట్రెండింగ్ సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా 'సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్'ను ప్రారంభించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సమాచార సేకరణకు ప్రతి జిల్లాలో మీడియా ప్రతినిధుల్ని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తామని వెల్లడించింది. వీరు ఆయా జిల్లాల్లో జరిగే సంఘటనలతో పాటు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారని పేర్కొంది. ఈ సమాచారాన్ని విశ్లేషించడానికి కేంద్ర స్థాయిలో నిపుణుల్ని నియమిస్తామంది. ఈ ప్రాజెక్టు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, బెంగాలి, తమిళ్, కన్నడ సహా పలు భాషల్ని సపోర్ట్ చేస్తుందనీ.. దీంతో అన్ని సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియాల్లోని సమాచారాన్ని సేకరించవచ్చంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







