లాస్ ఏంజిల్స్‌లో తెలుగు సీఈవోలను కలిసిన నారా లోకేష్
- January 29, 2018
లాస్ఏంజిల్స్: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ లాస్ ఏంజిల్స్‌లో ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో నిర్వహించారు. అనంతరం వరుసగా తెలుగు సీఈవోలను కలిశారు. అమెరికా వచ్చే వారికి నైపుణ్య శిక్షణ అందించాలని కోరారు. అలాగే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని తెలుగు సీఈవోలను ఆయన కోరారు. పిబి సిస్టమ్స్ కంపెనీ సీఈవో వేణు గార్నేని లోకేష్ కలిశారు. సాఫ్ట్వేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్సియల్, హెల్త్ కేర్‌లో పిబి సిస్టమ్స్ఈ కామర్స్ సర్వీసెస్‌ను అందిస్తున్నది. ఏపీలో హెల్త్ కేర్, టెలి మెడిసిన్‌లో అవకాశాలు ఉన్నాయని, కార్యకలాపాలు విస్తరించాలని మంత్రి కోరారు.
సెంట్రా మెడ్, ప్రెస్ మార్ట్ డిజిటల్ మీడియా కంపెనీ సీఈవో విక్రమ్ తొర్పునూరిని మంత్రి లోకేష్ కలిశారు. ఏపీలోని పాలసీలు, రాయితీలపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని సీఈవో విక్రమ్ అన్నారు. ఇండియాలో విస్తరించాలని ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు. తర్వాత ఐస్పేస్ సీఈవో రాజేష్ కొత్తపల్లిని లోకేష్ కలిశారు. టెక్నాలజీ, కన్సల్టింగ్, బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, ఐటీ రంగాల్లో ఐస్పేస్ సేవలు అందిస్తున్నది. ఏ రాష్ట్రంలో లేని విధంగా పాలసీలు, రాయితీలు ఇస్తున్నామని లోకేష్ తెలుపగా... విశాఖపట్టణంలో కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నామని ఐస్పేస్ సీఈవో చెప్పారు. సాఫ్ట్ హెచ్‌క్యూ సీఈవో క్రాంతి పొన్నం మాట్లాడుతూ ఏపీలో కార్యకలాపాలు విస్తరించాలనుకుంటున్నామని, గుంటూరులో కంపెనీ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అడ్వాన్డ్స్ బ్యాటరీ సిస్టమ్స్ కంపెనీ సీఈవో రిచర్డ్ కెయిన్, వైస్ ప్రెసిడెంట్ మైక్ పాలోమీరాను మంత్రి లోకేష్ కలిశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగం పెంచడానికి... నూతన పాలసీలు తీసుకొస్తున్నట్లు మంత్రి వారికి వివరించారు. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడబోతున్నామని, లితియం అయాన్ బ్యాటరీ తయారీలో ఉన్న...అడ్వాన్డ్స్ బ్యాటరీ సిస్టమ్స్ తయారీ రంగాన్ని, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్నామని లోకేష్ తెలిపారు. లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన రిచర్డ్ కెయిన్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వస్తామని అన్నారు. మార్కెట్ అంచనా, పాలసీలు, రాయితీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండియాలో బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఏపీలో కంపెనీ ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రిచర్డ్ కెయిన్ చెప్పారు.
సాఫ్ట్ హెచ్‌క్యూ సీఈవో క్రాంతి పొన్నంను మంత్రి లోకేష్ కలిశారు. ఎంటర్ప్రైస్ స్టాఫ్ అగ్యుమెంటేషన్, మేచ్యుర్ మోడల్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ కంట్రోల్, సేర్వేలెన్స్ ప్లాన్ తదితర సేవలను సాఫ్ట్ హెచ్‌క్యూ అందిస్తున్నది. సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ కోసం ఈ-ప్రగతి ప్లాట్ ఫార్మ్ ప్రారంభించామని పొన్నం తెలిపారు. బ్లాక్‌చైన్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఫిన్‌టెక్ లాంటి అధునాతన టెక్నాలజీల అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నట్లు లోకేష్ చెప్పారు. కంపెనీ ఏర్పాటుకు కావాల్సిన సహకారం అందిస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







