గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో బ్రూనో మార్స్ టాప్
- January 29, 2018
న్యూయార్క్ః గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో బ్రూనో మార్స్ టాప్‌గా నిలిచాడు. ఈ ఏడాది బ్రూనో మార్స్‌కు ఆరు గ్రామీలు దక్కాయి. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ ట్రోఫీని కూడా అతనే గెలుచుకున్నాడు. కెండ్రిక్ లామర్ టీమ్‌ను అప్సెట్ చేసిన బ్రూనో అనూహ్యంగా గ్రామీ షోలో అత్యధిక అవార్డులను దక్కించుకున్నాడు. కెండ్రిక్ లామర్‌కు అయిదు గ్రామీలు దక్కాయి. పాప్ స్టార్లు లేడీ గాగా, యూ2, లామర్, రిహాన్నా, ఎల్టన్ జాన్, మిలే సైరస్‌లు ప్రత్యేక షో నిర్వహించారు. న్యూయార్క్ సిటీలోని మాడిసన్ స్కేర్ గార్డెన్లో ఈ ఈవెంట్ జరిగింది. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డును అలెసియా కారా గెలుచుకున్నది. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్(24కే మ్యాజిక్), రికార్డర్ ఆఫ్ ద ఇయర్ (24కే మ్యాజిక్), సాంగ్ ఆఫ్ ద ఇయర్ (దట్స్ వాట్ ఐ లైక్), బెస్ట్ ఆర్ అండ్ బీ ఆల్బమ్(24కే మ్యాజిక్)లను బ్రూనో మార్స్ గెలుచుకున్నాడు. షేప్ ఆఫ్ యూ సాంగ్‌తో హిట్ కొట్టిన ఎడ్ షీరన్‌కు బెస్ట్ పాప్ ఆల్బమ్ క్యాటగిరీలో అవార్డు దక్కింది. ద వార్ ఆన్ డ్రగ్స్‌కు బెస్ట్ రాక్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. కెండ్రిక్ లామర్‌కు చెందిన డామ్ ఆల్బమ్‌కు బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అవార్డు దక్కింది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







