సైరా సెట్లోకి అమితాబచ్చన్
- January 29, 2018
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా మూవీ సెట్స్‌లోకి సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సైరాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ త్వరలోనే మెగాస్టార్‌తో కలిసి మూవీ షూటింగ్లో పాలుపంచుకోనున్నారు. ఖైదీ నెంబర్ 150 ద్వారా టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ ఈ మూవీలో నటిస్తున్నారని, త్వరలోనే ఆయన షూటింగ్లో పాల్గొంటారని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.
మూవీలో అమితాబ్ ఏ పాత్ర పోషిస్తున్నారనేది ఇప్పుడే వెల్లడించలేమని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు సైరాలో అమితాబ్ కోడలు ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడినా చిత్ర యూనిట్ నయనతారను చిరుకు జోడీగా ప్రకటించి రూమర్లకు చెక్ పెట్టింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా మూవీని చిరు తనయుడు రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







