ఇండియాతో చైనా చర్చలకు సిద్ధం
- January 29, 2018
బీజింగ్ః వివాదాస్పద చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్ట్‌పై ఇండియాతో చర్చలకు తాము సిద్ధమని చైనా స్పష్టంచేసింది. 5 వేల కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్ట్ విషయంలో భారత్‌కు ఉన్న అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరిస్తామని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హువా చున్యింగ్ చెప్పారు. చైనాలో భారత రాయబారిగా ఉన్న గౌతమ్ బాంబావాలె.. సీపీఈసీ విషయంలో రెండు దేశాల మధ్య ఉన్న విభేదాలను అంత తేలిగ్గా కొట్టిపారేయలేమని అన్నారు. అయితే ఈ విషయంలో చైనా తన వైఖరిని ఇప్పటికే స్పష్టంచేసిందని, రెండు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్య పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చున్యింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య తలెత్తుతున్న విభేదాలను పరస్పర గౌరవంతో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత రెండు దేశాలపై ఉన్నదని ఆమె అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఒక దేశాన్నే కోరడం సరికాదు. సమస్య పరిష్కారం కోసం ఇండియాతో కలిసి పనిచేయడానికి, చర్చించడానికి సిద్ధమని చున్యింగ్ చెప్పారు. సీపీఈసీ కేవలం ఓ ఆర్థిక సహకార ప్రాజెక్ట్. ఇది ఏ మూడో వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నది కాదు.
ఇండియా ఆ దిశగా ఆలోచించి, చైనాతో దోస్తీని బలోపేతం చేసుకోవాలని ఆశిస్తున్నాం అని చున్యింగ్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వెళ్తున్న సీపీఈసీ ప్రాజెక్ట్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







