లష్కరే తాయిబాపై ఛార్జీషీట్ దాఖలు

- January 29, 2018 , by Maagulf
లష్కరే తాయిబాపై ఛార్జీషీట్ దాఖలు

శ్రీనగర్: 2017 జులైలో అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు లష్కరే తాయిబా (పాక్ ఉగ్రవాద సంస్థ) తోపాటు దాడి కుట్రకు పాల్పడిన 11మందిపై చార్జీషీట్ దాఖలు చేశారు. ఆరు నెలల్లో ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి..వివిధ సెక్షన్ల కింద 1600 పేజీలతో కూడిన చార్జీషీట్ దాఖలు చేశారు. చార్జీషీట్ నమోదైన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు దక్షిణ కశ్మీర్ ఎస్పీ పాని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com