సౌదీ మార్గంలోనే ఉత్తరప్రదేశ్
- January 29, 2018
లక్నో: ఉత్తర ప్రదేశ్‌కి చెందిన దేవ్‌బంధ్ సంస్థ ముస్లిం మహిళల్లో క్రమశిక్షణ అలవర్చడమనే నెపంతో మరో ఫత్వాను జారీ చేసింది. ఇందులో భాగంగా ముస్లిం మహిళలు ఫుట్‌బాల్ ఆటను చూడటంపై నిషేధం విధించింది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు మోకాళ్ల వరకు దుస్తులు ధరించడం కారణంగా వారికి ముస్లిం మహిళలు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నందున్న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలు మగ వాళ్లను ఆ విధంగా చూడటం ముస్లిం చట్టాల ప్రకారం పాపం అని దేవ్‌బంధ్ ప్రతినిధి ముఫ్తీ అతర్ కస్మీ అన్నారు.
2015లో సౌదీ అరేబియాలో జారీ చేసిన ఫత్వా ఆధారంగా ఈ కొత్త ఫత్వాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఫుట్‌బాల్ ఆటలో స్కోర్లు, ఆనందం కోసం కాకుండా ఆటగాళ్ల కాళ్లను, తొడలను చూడటానికే ముస్లిం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని అప్పట్లో షేక్ సాద్ అల్ హజారీ ఫత్వా జారీ చేశారు. అలాగే భార్యలను ఫుట్‌బాల్ ఆట చూసేందుకు అనుమతిస్తున్న భర్తలకు కూడా ఆ ఫత్వాలో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే ఫత్వా మార్గదర్శకాలను దేవ్‌బంధ్ సంస్థ కూడా అనుసరించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!







