ఘనంగా జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి
- January 30, 2018
న్యూఢిల్లీ : జాతిపిత మహాత్మాగాంధీ 70వ వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గాంధీ వర్ధంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తెలంగాణలోనూ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ నరసింహన్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వారు మౌనం పాటించారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిపివేసి, హారన్లు మోగించలేదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







