పోలవరం టెండర్లు నవయుగ సంస్థలుకే
- January 30, 2018
దిల్లీలో ముగిసిన కీలక భేటీ దిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై దిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వద్ద కీలక భేటీ ముగిసింది. ప్రాజెక్టులో స్పిల్వే కాంక్రీటు, స్పిల్ ఛానల్ పనులను కొత్త గుత్తేదారుకు అప్పగించే అంశంపై ఈ సమావేశంలో ఓ స్పష్టత వచ్చింది. దీనిపై రెండు గంటలపాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ, జలసంఘం అధికారులతో భేటీ అనంతరం మంత్రి గుత్తేదార్లతో కాసేపు సమావేశమయ్యారు. నవయుగ, ట్రాన్స్ట్రాయ్ గుత్తేదారు సంస్థల్లో వేటికి ఈ పనులు అప్పగించే అంశంపై చర్చించారు. పోలవరం ప్రధాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఇప్పటివరకు అనుకున్నవిధంగా నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయని నేపథ్యంలో ఈ పనులను నవయుగకు అప్పగించాలని నిర్ణయించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పాత ధరలతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నవయుగతో అంగీకారం కుదిరింది. నవయుగ కంపెనీకి స్పిల్వే, ఛానల్ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువును ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొనేందుకు అవగాహన ఒప్పందం కుదరనుంది. దీనిప్రకారం స్పిల్వే, స్పిల్ఛానల్ పనుల్ని నవయుగ సంస్థ వారం రోజుల తర్వాత చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర







