ఒమన్‌లో పెరిగిన ఫ్యూయల్ ధరలు
- January 31, 2018
మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, ఫ్యూయల్ కోసం ఫిబ్రవరి 1 నుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ మేరకు కొత్త ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. ఎం91 ఫ్యూయల్, 199 నుంచి 207 బైసాస్‌కి పెరిగింది. ఇది లీటర్ ధర. ఎం 95 ఫ్యూయల్ ధర 213 బైసాస్ నుంచి 218 బైసాస్‌కి పెరిగింది. డీజిల్ ధర కూడా 230 బైసాస్ నుంచి 244 బైసాస్‌కి చేరుకుంది. ఇటీవల కొత్తగా లాంఛ్ చేసిన ఎం 98 గ్రేడ్ ఫ్యూయల్ ధర 266 బైసాస్‌కి పెరిగింది. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల పట్ల రెసిడెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. నేషనల్ సబ్సిఇడి స్కీమ్ కింద అల్పాదాయ ఒమనీయులకు మాత్రం ఎం 91 ఫ్యూయల్ సబ్సిడీ కింద 180 బైసాస్కే లభిస్తోంది. 220,000 మంది ఈ స్కీమ్‌కి దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!







