హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష
- January 31, 2018
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఓ హత్య కేసులో ఇద్దరికి మరణ శిక్ష విధించింది. 19 మందికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. మరో 17 మంది నిందితులకు 15 ఏళ్ళ జైలు శిక్ష, 9 మందికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 11 మందికి ఐదేళ్ళ జైలు శిక్ష విధంచగా, ఇద్దరి నిర్దోషులుగా నిర్ధారించింది. 48 మంది నిందితుల పౌరసత్వాన్ని రద్దు చేసింది న్యాయస్థానం. 60 మంది నిందితులు, తీవ్రవాద సంస్థని ఏర్పాటు చేసి, తీవ్రవాద కార్యకలాపాల్ని చేపట్టారు. పేలుడు పదార్థాల్ని ఇంపోర్ట్ చేసుకుని, వాటి ద్వారా బాంబుల్ని తయారు చేసినట్లు విచారణలో తేలింది. జనవరి 1, 2017న నిందితులు ఓ పోలీస్‌ని చంపేశారు. ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేయడం, తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేగంగా సాగింది. మొత్తం 60 మంది నిందితులపైనా విచారణ జరిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..