అమ్మాయి వలలో పడి వైటల్ ఇన్ఫర్మేషన్ లీక్
- February 01, 2018
న్యూఢిల్లీ : ఇండియన్ ఫోర్స్‌కు చెందిన ఓ సీనియర్ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కీలక రహస్య సమాచారాన్ని తనతో సన్నిహితంగా ఉండే అమ్మాయితో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారని ఆయనను అరెస్టు చేశారు. సమాచారాన్ని పొందిన ఆ మహిళ ఓ గుఢాచారి అని, సదరు అధికారిని ట్రాప్‌లోకి దింపి మంచితనంగా వ్యవహరించి వలపన్ని ఈ పనిచేసినట్లు తెలిపారు. ఆ అధికారి ఢిల్లీ ఉన్నత కార్యాలయాల్లో ర్యాంక్ స్థాయి అధికారి అని సమాచారం.
ఓ క్లాసిఫైడ్ సమాచారాన్ని అతడు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఆ మహిళకు పంపించినట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సెంట్రల్ సెక్యూరిటీ దర్యాప్తు బృందం ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. సాయుధ బలగాల్లో సోషల్ మీడియాను ఉపయోగించే విషయంలో తాము కఠిన నిబంధనలు పాటిస్తామని, అధికారులు తమ ర్యాంకులను, హోదాలను కూడా వాటి ద్వారా పంచుకునేందుకు వీలుండదని సమాచారం. వారు ధరించిన దుస్తులతో ఫొటోలు దిగి కూడా ఆ అధికారులు సోషల్ మీడియా ద్వారా పంచుకోకూడదని ఓ సీనియర్ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







