మిస్ పాపులర్ టైటిల్ వేటలో తెలుగమ్మాయ్ రీతూ రావ్
- February 02, 2018
ముంబై:మిస్ అండ్ మిసెస్ తియారా ఇండియా 2018 పోటీల్లో 19 ఏళ్ళ తెలుగమ్మాయి రీతూరావు 'మిస్ పాపులర్' కేటగిరీ కోసం బరిలో నిలిచింది. లోనావాలో ప్రస్తుతం పోటీల కోసం సన్నద్ధమవుతోంది రీతూ రావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న రీతూ రావు, ఈ పోటీల కోసం తనకు తెలుగువారందరి మద్దతు కావాలని కోరుతోంది. ఫిబ్రవరి 6న ముంబైలోని మహాకవి కాలిదాస్ ఆడిటోరియంలో ఈ పోటీలు జరుగుతాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత, డైరెక్టర్ అర్భాజ్ ఖాన్, మోడల్ ఆర్యన్, బాలీవుడ్ సింగర్ షిబానీ కశ్యప్ ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. రీతూ రావు తండ్రి, ఓ ఎంఎన్‌సీ కంపెనీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె తల్లి సుజాతారావు ఎంటర్‌ప్రెన్యూర్. కళా నిలయం పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నారామె. రితూ రావ్ సోదరి రిహా రావ్ 10వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు రీతూ రావ్ అందాల పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.


తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







