గల్ఫ్‌లో ఉద్యోగం...అనుమానంతో భార్యను హతమార్చాడు...
- February 02, 2018
అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మండవారి గరువు గ్రామంలో చోటు చేసుకుంది. రాడ్‌తో భార్య తలపై కొట్టి చంపాడు భర్త. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంకటేశ్వరరావుకు సీతామహాలక్ష్మికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గల్ఫ్‌లో ఉద్యోగం కోసం వెళ్లిన వెంకటేశ్వరరావు చాలా కాలం అక్కడే ఉండి, ఇటీవలే తిరిగొచ్చాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రాడ్‌తో కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







