అనుష్కని ప్రశంసలతో ముంచెత్తిన రజని
- February 03, 2018
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భాగమతి'. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. జి. అశోక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.12 కోట్లు వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు అనుష్కపై ప్రశంసల జల్లు కురిపించారు. 'భాగమతి' సినిమా చూసిన తర్వాత తన భార్య ఉపాసనకు నిద్రపట్టలేదని రామ్‌చరణ్ ఫేస్‌బుక్ వేదికగా పేర్కొన్నారు. కాగా, అనుష్క తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'ఇప్పటి వరకు మీకు అందిన ప్రశంసల్లో ఉత్తమమైనది ఏది?' అని అడిగిన విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు.
''రజనీకాంత్ ఫోన్ చేశారు.
'భాగమతి' సినిమా చాలా నచ్చింది అన్నారు. మనం ఓ సినిమా చేయడం.. సూపర్‌స్టార్ ఫోన్ చేసి అలా అభినందించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, నా స్నేహితులు కూడా శుభాకాంక్షలు చెబుతూ సందేశాలు పంపారు'' అంటూ ఆనందం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







