యూఏఈ తయారీ శాటిలైట్‌ని పరిశీలించిన షేక్ మొహమ్మద్
- February 03, 2018
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, ఖలీఫా శాట్ ప్రాజెక్ట్‌ని పరిశీలించారు. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్‌సెంటర్‌లో ఈ శాటిలైట్‌ని ఆయన పరిశీలించడం జరిగింది. ఖలీఫా ఎమిరేటీ ఇంజనీర్లు తయారు చేసిన తొలి శాటిలైట్. ఈ ఏడాదిలోనే ఈ శాటిలైట్‌ని ప్రయోగిస్తారు. అరబ్ ప్రపంచంలో తొలిసారిగా ఈ ఘనత జాధించింది ఎమిరేటీ ఇంజనీర్లేనని షేక్ మొహమ్మద్ చెప్పారు. యూఏఈ సాధించిన ఘనవిజయాల్లో ఇదొకటని ఆయన చెప్పారు. ఎంబిఆర్‌ఎస్‌సి ఛైర్మన్ హమాద్ ఒబైద్ అల్ మన్సౌరీ, మేజర్ జనరల్ తలాల్ హమీద్ బెల్హౌల్ అల్ ఫలాసి, ఎంబిఆర్‌ఎస్‌సి డైరెక్టర్ జనరల్ యసుఫ్ అల్ షైబాని, షేక్ మొహమ్మద్‌కి ఆహ్వానం పలికారు. ఈ సెంటర్‌లో షేక్ మొహమ్మద్ కలియతిరగ్గా, ఆయనకు వివిధ అంశాలపై వివరణ ఇచ్చారు అక్కడి ప్రముఖులు. ఎంబీఆర్‌ఎస్‌సి తరఫున ఇది మూడో శాటిలైట్.
తాజా వార్తలు
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక







