తగ్గిన అద్దెలు: యూఏఈ రెసిడెంట్స్‌కి ఊరట
- February 03, 2018
వ్యాట్ కారణంగా కొంతమేర రెసిడెంట్స్‌కి ఆర్థికంగా భారమైనప్పటికీ, గత ఏడాదితో పోల్చితే ఇంటి అద్దెలు తగ్గడం రెసిడెంట్స్‌కి ఊరటనిచ్చే అంశమే. గ్లోబల్ డేటా సర్వీస్ ప్రొవైడర్ నుంబియో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2018లో యూఏఈ రెసిడెంట్స్, తక్కువ ఫైనాన్షియల్ స్ట్రెస్‌ని రెంట్స్ విషయంలో కలిగి ఉన్నారని తేలింది. యూఏఈలో ఏ నగరమూ, 200 మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకోలేదు. అబుదాబీ, దుబాయ్, షార్జా నివసించడానికి వీలుగా ఉన్న నగరాలుగా నుంబియో గుర్తింపు పొందాయి. దుబాయ్ 210వ స్థానం దక్కించుకుంది. మొత్తం 540 నగరాలు ఈ లిస్ట్‌లో పోటీ పడ్డాయి. అబుదాబీ 303వ స్థానానికి పడింది 252 నుంచి. షార్జా 273 నుంచి 324వ స్థానానికి దిగింది. దీనర్ధం తక్కువ అద్దెతోనే ఆయా నగరాల్లో హాయిగా నివసించే వీలుంటుందని. తగ్గిన అద్దెలతో రెసిడెంట్స్, తద్వారా మిగిలిన మొత్తాన్ని ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన వ్యాట్ ద్వారా తలెత్తిన ఇబ్బందుల నుంచి రెసిడెంట్స్ తేలిగ్గానే బయటపడ్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!