ఇక మెరుపు వేగంతో రెబల్ స్టార్ ప్రభాస్
- February 04, 2018
ఏడాదికి కనీసం నాలుగైదు చిత్రాలతో తెరపైకి వచ్చేవారు నిన్నటి తరం కథానాయకులు. అయితే ఇప్పటి హీరోలకు అది సాధ్యమవడం లేదు. మంచి కథ, దాన్ని తెరకెక్కించే సాంకేతిక నిపుణులు, పూర్వ నిర్మాణ కార్యక్రమాలతోనే ఏడాది గడిచిపోతోంది. దీంతో వేగంగా సినిమాలు చేయడం ఇప్పటి స్టార్లకు కుదరడం లేదు. అప్పటిలా కేవలం సాంఘిక చిత్రాలు తగ్గిపోవడం, కొత్తగా ఏవైనా కథలు ప్రయత్నించడం ఇప్పటి చిత్రాల రూపకల్పనకు ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నాయి. వీళ్లలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ కూడా ఉంటారు. ఆయన చేసేది మంచి ప్రయత్నమే అయినా..కాలహరణమే ఇబ్బంది పెడుతోంది. ఐదేళ్ల బాహుబలి రెండు భాగాల తర్వాత సాహోకు రెండేళ్లు తీసుకుంటున్నారు. అభిమాన కథానాయకుడిని ఏడాదిలో ఒకసారైనా తెరపై చూసుకోవాలనుకునే వాళ్లకు ఇది కష్టమవుతోంది. గొప్ప సినిమా కోసం సర్దుకుపోవాలి అనుకునే అభిమానులూ ఉన్నారు. ఏమైనా తన సినిమాలకు సుదీర్ఘ కాలం పట్టడం ప్రభాస్ కూడా అంతగా ఇష్టపడటం లేదు. ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న ఈ స్టార్..తన తదుపరి చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌లోనే ఉండబోతోంది.
ఈ మరుసటి చిత్రాన్ని మాత్రం అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. కేవలం నెలల సమయంలోనే సినిమా తెరకెక్కించి..తెరపైకి తీసుకురావాలని ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







