ఆటో చార్జీల కన్నా విమాన చార్జీలు చౌక అంటున్న సిన్హా
- February 04, 2018
ఇండోర్ : దేశంలో కిలో మీటర్‌కు ఆటోలో ప్రయాణం కన్నా విమాన ప్రయాణమే చౌకగా మారిందని పౌర విమానాల సహాయక మంత్రి జయంత్ సిన్హా పేర్కొన్నారు. 27వ ఇండోర్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో విమానాల చార్జీలు, ఆటోరిక్షాల చార్జీల కంటే తక్కువగా ఉన్నాయని, తాను తప్పుగా మాట్లాడటం లేదని, ఇది నిజం అని ప్రసంగించారు. ఇండోర్ నుండి ఢిల్లీకి విమాన ప్రయాణానికి కిలో మీటర్‌కు రూ.5 ఖర్చు పెడుతున్నారని, అదే ఆటోలో వెళితే కిలోమీటర్‌కు 5 నుండి 8 రూపాయలను ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. తక్కువగా చార్జీలు వసూలు చేస్తున్నందున ఎక్కువ మంది విమాన ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







