దుబాయి అగ్ని ప్రమాదం : అగమ్యగోచరంగా నిర్వాసితులు
- November 24, 2015
దుబాయి, సలాలా అల్ దీన్ వీధిలో ఈ సోమవారం ఐదు అంతస్తుల, 48 అపార్ట్ మెంట్లు గల, 40 సంవత్సరాల పాత భవంతి లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటనలో కనీసం 500 మంది ఉనికికి, నివాసానికి, విద్యార్హతలకు సంబంధించిన పాస్ పోర్టులు, డిగ్రీ సర్టిఫికెట్లు వంటి ధ్రువ పత్రాలు కోల్పోయి, నడివీధిలో వణికించే చలిలో మిగిలిపోయారు. భవన యజమాని కుమారుడు -అబ్దుల్ రహ్మాన్ అల్ షమ్సీ, ఈ దిగ్భ్రాంతి కలిగించే సంఘటనతో ఎం మాట్లాడాలో తెలియకుండా ఉన్నానని, నివాసులకు జరిగిన నష్టానికి తాము ఎంతో చింతిస్తున్నామని, తాము కూడా ఈ సంఘటన వలన చాలా నష్టం చవిచూసామని, అయినా తమ రియల్ ఎస్టేట్ సంస్థ తరపున చేయగలిగినది తాము చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా ఇంచుమించు ఒకే రకమైన విషాదాన్ని ఎదుర్కొంటున్న నిర్వసితులందరూ భవనం వెనుక గుమిగూడి ప్రభుత్వం తమ కష్టాలను తీరుస్తుందనే ఆశను కళ్ళలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







