తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటాం : టర్కీ ఆర్మీ
- February 04, 2018
అంకారా: సిరియాలో మోహరించిన తమ సైనికులపై మెరుపుదాడికి పాల్పడ్డ కుర్దు తిరుగుబాటుదారులపై ప్రతీకారం తీర్చుకుంటామని టర్కీ పేర్కొన్నది. కుర్దు తిరుగుబాటుదారుల శిబిరాలను ధ్వంసం చేయనున్నట్టు ప్రకటించింది. టర్కీ ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఆఫ్రిన్ నగరానికి సమీపంలో ఉన్న షేక్ హరూజ్ నగరంలో కుర్దు తిరుగుబాటుదారులు ఆదివారం బీభత్సం సృష్టించారు. టర్కీ సైనికుల యుద్ధ ట్యాంక్పై వైమానిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారదు. క్షతగాత్రులను సైనిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







