ప్రత్యేక హోదా వల్లే ఏపీ అభివృద్ధి: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ
- February 04, 2018
హైదరాబాద్: కొన్ని ప్రత్యేకమైన విషయాలపై స్పందించడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కానక్కర్లేదని టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి నిరాశే ఎదురవడంతో నటుడు నిఖిల్ తన వంతుగా గళం విప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, అది ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నిధుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కొందరు తనను 'నీకు ఏపీకి ప్రత్యేక హోదా' లాంటి విషయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో దీనిపై నిఖిల్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.
'ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర నుంచి రాష్టానికి ప్రత్యేక సాయం అందాలన్నా, ఏపీలో మరింత అభివృద్ధి జరగాలన్నా హోదాతోనే సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. కొంత మంది ఇలాంటి విషయాలు నీకెందుకని ప్రశ్నిస్తున్నారు. తెలుగు వ్యక్తిగా, ఓ భారతీయుడిగా అభివృద్ధి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు వచ్చినప్పుడే ఏపీలో అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని' నటుడు నిఖిల్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తుందంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ కిర్రాక్ పార్టీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు