ప్రవాసియ భారతీయుడికి ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ లో దక్కిన రూ. 17.45 కోట్లు
- February 05, 2018
అబుదాబి : ఎడారిలో ఒయాసిస్సు ఎలా ఊరట ఇస్తుందో ...అధేవిధంగా పిల్లాపాపలను వదిలి ఎడారి దేశాలకు బతుకుజీవుడా అని వెళ్లిన ప్రవాసియలను పలు లాటరీలు వారి జీవితంపై పన్నీటి జల్లు కురిపిస్తున్నాయి. అదృష్టం అనేది అత్యధికులకు కుంటుతూ అత్యంత నెమ్మదిగా వస్తుంది.కానీ అతి తక్కువమందికి అదే అదృష్టం ఆఘమేఘాలపై వస్తుంది. యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న కేరళకు చెందిన ఓ భారతీయుడికి అబుదాబిలో నిర్వహించే ‘‘ బిగ్ టికెట్ డ్రా’’ స్వంతమైంది. దీంతో ఆ వ్యక్తికి రూ. 17.45 కోట్లు దక్కింది. సునిల్ మప్పట్ట కుట్టీ నాయర్ అనే లక్ష్మీ పుత్రుడు ప్రస్తుతం భారత్కు వస్తున్నాడని ‘‘బిగ్ టికెట్ డ్రా’’ నిర్వహకులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ ఏడాది ‘‘ ది బిగ్ టెన్ సిరీస్ 188’’లో అబుదాబిలో ప్రకటించిన లక్కీ డ్రాల్లో ఇది రెండవ అతిపెద్ద డ్రా. గత నెలలో భారత్కు చెందిన దుబాయ్లో అజ్మాన్ ప్రాంతంలో నివాసముండే హరిక్రిష్ణన్ నాయర్ అనే వ్యక్తికి 12 మిలియన్ దిర్హమ్ల భారీ లక్కీ డ్రా వరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత







