హృతిక్ 'సూపర్ 30' మూవీ ఫస్ట్ లుక్..

- February 06, 2018 , by Maagulf
హృతిక్ 'సూపర్ 30' మూవీ  ఫస్ట్ లుక్..

బాలీవుడ్ క్రిష్ హృతిక్ రోషన్ తాజాగా సూపర్ 30 మూవీ చేస్తున్నాడు.. ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు ఆనంద్ కుమార్ జీవితకథ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. సూపర్ 30 స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్ధులని తీర్చిదిద్దారు ఆనంద్ కుమార్ . పాట్నాలో ఎకనామికల్ బ్యాక్ వర్డ్ సెక్షన్‌కి చెందిన 30 విద్యార్ధులని సెలక్ట్ చేసి జేఈఈ తోపాటు ఐఐటీ ట్రైనింగ్ ఇచ్చి ఎందరికో స్పూర్తిని కలిగించిన వ్యక్తి ఆనంద్ కుమార్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వారణాసిలో కొనసాగుతున్నది.. తాజాగా ఈ చిత్రంలోని హృతిక్ పాత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. గుబురు గడ్డంతో డీ గ్లామర్ లుక్‌లో హృతిక్ కనిపిస్తున్నాడు. ఈ మూవీకి వికాస్ బేహ్లీ దర్శకుడు..వచ్చే ఏడాది జనవరి 25వ తేదిన ఈ మూవీ విడుదల కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com