'ఇది నా లవ్ స్టోరి' ఆకట్టుకుంటుంది:సినీ యాక్టర్ తరుణ్
- February 07, 2018
తిరుపతి: 'చాలా కాలం తర్వాత మీ ముందుకొస్తున్నా..' అంటూ సినీ హీరో తరుణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది నా లవ్ స్టోరి చిత్ర ప్రమోషన్లో భాగంగా మంగళవారం సాయంత్రం చిత్ర బృందం తిరుపతికి చేరుకుంది. నగరంలోని బ్లిస్ హోటల్లో తరుణ్ మీడియాతో మాట్లాడారు. చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకునేలా నిర్మించామన్నారు. ఈనెల 14వ తేదీన సినిమా విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే 13 కళాశాలల్లో నిర్వహించిన చిత్ర ప్రమోషన్ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందన్నారు. ఫ్రెష్ అండ్ యంగ్ టీమ్‌తో.. విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామ న్నారు.
తమిళం, మలయాళంలో నటించిన ప్రముఖ హీరోయిన్ ఓవియా తొలిసారిగా తెలుగులో నటిస్తోందన్నారు. తమిద్దరి మధ్య సన్నివేశాలు చిత్రంలో చాలా అద్భుతంగా వచ్చాయన్నారు. 13వ తేదీన మహా శివరాత్రి, 14వ తేదీన ప్రేమికుల రోజు రావడం.. అదే రోజు తమ చిత్రం విడుదల కానుండటం సంతోషంగా ఉందన్నారు. నిర్మాత ఎస్వీ ప్రకాష్ సారథ్యంలో రమేష్, గోపీల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారన్నారు.
శ్రీనాథ్ విజయ్ సంగీతం, క్రిస్టఫర్ జోసెఫ్ కెమెరా మెన్ కృషితోపాటు యూనిట్‌లోని అందరి కృషి అమోఘమన్నారు. ఇక చిత్ర దర్శక ద్వయం (సోదరులు) గతంలో తిరుపతిలో జర్నలిస్టులుగా పనిచేశారన్నారు. వీరిద్దరిదీ కుప్పం కావడం గమనార్హమన్నారు. అందువల్ల చిత్ర ప్రమోషన్లో భాగంగా కుప్పం వెళుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు శ్రీనాథ్ విజయ్, చిత్ర యూనిట్ బృందం పాల్గొంది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







