ఐపీఎల్‌లోకి ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్'రీ'ఎంట్రీ
- February 07, 2018
న్యూదిల్లీ: విజయవంతంగా 10 సీజన్లు పూర్తి చేసుకొని మరికొన్ని రోజుల్లో పదకొండో సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది ఇండియన్ ప్రీమియల్ లీగ్(ఐపీఎల్). ఇటీవల జరిగిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ అట్టహాసంగా ముగిసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయా ఫ్రాంఛైజీలు కోచింగ్, సహాయ సిబ్బందిని నియమించుకునే పనిలో ఉన్నాయి. లీగ్‌లోని కొన్ని జట్లు పాత వారినే కొనసాగిస్తుండగా మరికొన్ని ఫ్రాంఛైజీలు తెరవెనుక ఉండి నడిపించే సిబ్బందిని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లపాటు(2016, 17) సీజన్లకు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ 2018 సీజన్‌లో పునరాగమనం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై దాదాపు మునుపటి సహాయ సిబ్బందిని కొనసాగిస్తుండగా.. రాజస్థాన్‌కు మాత్రం ఎలాంటి మార్గనిర్దేశకుడు లేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లోనే తన సారథ్యంలో టైటిల్ సాధించిపెట్టాడు ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్లో అనుభవజ్ఞుడు, మ్యాచ్ విశ్లేషకుడు, వ్యాఖ్యత అయిన వార్న్ సేవలను ఉపయోగించుకోవాలని రాజస్థాన్ యాజమాన్యం నిర్ణయించుకుంది. ఆ జట్టు ప్రధాన కోచ్‌గా అతడిని నియమించే అవకాశం ఉంది.
ఐతే గత కొద్ది రోజులుగా వార్న్ మళ్లీ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సోషల్ మీడియా ద్వారా స్పిన్ మాంత్రికుడు స్పందించాడు. 'మీ అందరికీ ఈ వారంలో ఓ ప్రకటన చేయబోతున్నా. ఎంతో ఆత్రుతగా ఉన్నా.
ఐపీఎల్-2018లో భాగస్వామ్యం కాబోతున్నా' అని వార్న్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా కొన్ని ఫ్రాంఛైజీలు షేన్‌కు స్వాగతం పలికాయి.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







