సోషల్‌మీడియాకు అనసూయ గుడ్‌బై ?
- February 07, 2018
సోషల్‌మీడియాకు గుడ్‌బై చెప్పిన అనసూయ?
హైదరాబాద్: ప్రముఖ నటి, యాంకర్ అనసూయ సోషల్‌మీడియాకు గుడ్‌బై చెప్పేసినట్లున్నారు. తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి ఫోన్‌ను పగలగొట్టారన్న కారణంగా అనసూయపై ఓ మహిళ కేసు పెట్టిన ఘటన దుమారం రేపింది. తాను ఫోన్ పగలగొట్టలేదని, బాలుడి తల్లి అబద్ధం చెబుతోందని అనసూయ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు కూడా.
అయినప్పటికీ నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తుండడంతో అనసూయ సోషల్‌మీడియా నుంచి తప్పుకొన్నట్లు సమాచారం. ఆమె ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కన్పించడంలేదు. గతంలోనూ కొందరు తన దుస్తులపై కామెంట్లు చేస్తున్నారని వారిని బ్లాక్ చేయాలనుకుంటున్నానని అనసూయ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
సోషల్‌మీడియాలో ఎదురవుతున్న కామెంట్లు తట్టుకోలేక ఆమె అన్ని మాధ్యమాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. పలువురు అభిమానులు ఆమెకు మద్దతుగా సామాజికమాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







