ప్రిన్స్ గడ్డం.. ఓ న్యూ స్టోరీ !

- February 07, 2018 , by Maagulf
ప్రిన్స్ గడ్డం.. ఓ న్యూ స్టోరీ !

ఎప్పుడూ క్లీన్ షేవ్ తో మెరుస్తూ కనబడే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. గడ్డం పెంచుకుని కనబడ్డం ఎప్పుడూ చూడలేదు. తన పాతిక సినిమాల్లో కూడా ఎక్కడా గడ్డం పెంచుకున్న దాఖలా లేదు. ఒకటీరొండు రోజుల పాటు పెంచుకున్న గడ్డం.. అదీ ట్రిమ్ చేసుకుని మాత్రమే బైటికొస్తారు మహేష్ బాబు. అతడి ఫ్యాన్స్ కూడా తమ హీరోను గడ్డంలో చూడాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ.. రాబోయే మూవీ 'భరత్ అనే నేను'లో ప్రిన్స్ గడ్డంతో కనిపించబోతున్నారా? ఇందులో నిజమెంతో తెలీదు గాని.. సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ మధ్య ఈ టాక్ మాత్రం జోరుగా నడుస్తోంది. సీఎం రోల్ చేస్తున్న మహేష్ బాబు కొన్ని సీన్లలో గడ్డం పెంచి నటించాల్సి వచ్చిందని.. ఈ విషయాన్నే డైరెక్టర్ కొరటాల ప్రస్తావిస్తే.. ప్రిన్స్ ఎమోషనల్ గా తీసుకుని.. మారుమాట్లాడకుండా సెట్స్ నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. తీవ్ర తర్జనభజన తర్వాత..

కొరటాల ప్రపోజల్ కి మహేష్ కన్విన్స్ అయ్యారట. కానీ.. పెంచిన గడ్డం కాకుండా పెట్టుడు గడ్డంతో అయితే చేస్తానని షరతు పెట్టారట! ఈ ఆర్టిఫీషియల్ గడ్డం కోసం తానెప్పుడూ విగ్గులు కొనుక్కునే పోలండ్ లోనే వెతుకుతున్నారని..

రేపటిరోజున BAN మూవీలో మహేష్ గడ్డంతో కనబడితే.. అది ఒరిజినల్ అని పొరపడొద్దని ఫ్యాన్స్ కి సూచనలిస్తూ 'ఎంజాయ్' చేస్తోంది అవతలి బ్యాచ్! ఇదంతా ఇంటర్నల్ ఎపిసోడ్ ! ఇటువంటి స్పైసీ టాక్ సోషల్ మీడియాలో ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు జరిగింది.

కాకపొతే.. సదరు సెలబ్రిటీల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com