అద్భుతం..మళ్లీ 27 ఏళ్ల తర్వాత కలిసి పాడిన పాట వైరల్‌..!

- February 07, 2018 , by Maagulf
అద్భుతం..మళ్లీ 27 ఏళ్ల తర్వాత కలిసి పాడిన పాట వైరల్‌..!

ప్రపంచంలో సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు..వర్షం కురుస్తుందని అంటారు..ప్రకృతి పులకిస్తుందని అంటారు. అవును మనిషి ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్న ప్రశాంతమైన సంగీతం వింటే మనసు కుదుట పడుతుందని నిపుణులు ఎంతో మంది చెప్పారు. ఇక భారత దేశంలో తమ పాటలతో ఎంతో మంది ప్రశంసలు పొందిన మహాగాయకులు ఇద్దరు..ఒకరు గాన గంధర్వుడు ఎస్‌పి బాల సుబ్బహ్మణ్యం, మరొకరు సంగీత చక్రవర్తి యేసుదాసు.

పాటలు పాడటంలో వారికి వారే సాటి..వారికి ఎవరూ లేరు పోటీ అనే విధంగా కెరీర్ కొనసాగించారు. ఇప్పటి వరుకు ఎన్నో అద్భుతమైన పాటలతో మనసు రంజింప చేశారు. వీరిద్దరు కలిసి 27 ఏళ్ళ తర్వాత మలయాళం, తమిళంలో తెరకెక్కుతున్న 'కినార్-కెని' సినిమాలోని 'అయ్య సామి' అనే పాటకు గాత్రం అందించారు.

1991లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన 'దళపతి' చిత్రంతో కలిసి పాడారు. కేరళ-తమిళనాడు సరిహద్దులో నీటి సమస్య నేపథ్యంలో రూపొందుతున్న సినిమాను నిషద్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ పాటని చిత్ర యూనిట్ యూ ట్యూబ్‌లో విడుదల చేయగా, ఇది సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది.

పాటలో కేరళ, తమిళ నాడు రాష్ట్రాల అందాలు, వారి సంస్కృతితో పాటు కమల్ హాసన్‌, రజనీకాంత్, మోహన్ లాల్‌, మమ్ముట్టి బొమ్మల చుట్టూ కళాకారులు స్టెప్పులు వేయడం ఒకటైతే మరోపక్క బాలు, యేసుదాస్‌ల గానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంలో జయప్రద, రేవతి ప్రధాన పాత్రలుగా ఈ మూవీ తెరకెక్కగా ఇందులో ఇందులో జయప్రద గృహిణి పాత్రలో, రేవతి తిరునెల్వేలి జిల్లా కలెక్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com