ఎయిర్‌పోర్టు బాత్రూమ్లో మహిళ ప్రసవం
- February 08, 2018
దుబాయ్ ఎయిర్పోర్ట్ రెస్ట్ రూమ్‌లో ఓ మహిళ ప్రసవించింది. అయితే ఆమె తొలుత రెస్ట్ రూమ్‌లోకి వెళ్ళి లోపల లాక్ చేసుకుంది. లేబర్ పెయిన్స్‌తో ఆమె బాధపడుతుండగా, క్లీనింగ్ సిబ్బంది ఆమెను గుర్తించి, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సమాచారమిచ్చారు. వెంటనే వైద్య బృందం ఆమె వద్దకు చేరుకుని, అవసరమైన సహాయం అందించింది. సుమారు నాలుగు గంటలపాటు లేబర్ పెయిన్స్ అనుభవించిన మహిళ ఎట్టకేలకు ప్రసవించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రసవించిన మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. లతీఫా హాస్పిటల్లో తల్లికి, బిడ్డకు వైద్య చికిత్స అందించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి లక్షలాదిగా ప్రయాణీకులు వచ్చి వెళుతుంటారనీ, ప్రతి యేడాదీ ఇలాంటి చిత్రమైన కేసులు నమోదవుతుంటాయని, మానవీయ కోణంలో వాటిని పరిష్కరిస్తంటామని దుబాయ్ పోలీస్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ అతీక్ బిన్ లహెజ్ చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







