కువైట్ లో కుంభకర్ణుడు... రహదారి మధ్యలో నిద్ర
- February 08, 2018
కువైట్ : ' ఆకలి రుచి ఎరగదు ...నిద్ర సుఖమెరుగదు ...మాదకద్రవ్యాలు తీసుకొన్న తర్వాత వచ్చే మత్తు ట్రాఫిక్ గమనించదు. సూడాని దేశానికి చెందిన ఓ వ్యక్తి ట్రాఫిక్ రద్దీతో కిట కిటలాడుతున్న మార్గంలో కారు నడుపుతూ అకస్మాత్తుగా నడిరోడ్డుమధ్యలో తన కారును నిలిపివేసి మగాథలోనికి జారుకున్నాడు. దీంతో ఆ మత్తుబాబు మొత్తం ట్రాఫిక్ నే అడ్డుకున్నాడు. వెనుక నిలిచిపోయిన వాహనదారులు ఎంతగా హారన్లు కొట్టిన ..దగ్గరకు వచ్చి లేపేందుకు ప్రయత్నించినా ఆ డ్రైవర్ ఏమాత్రం స్పందించలేదు. విసిగివేశారిన వాహనదారులు ఇక తప్పని స్థితిలో పోలీసులను పిలిచారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆ డ్రైవర్ చేతిలో హషిష్ మాదకద్రవ్యం కోరిన సిగరెట్ ను కనుగొన్నారు.. మాధకద్రవ్యాల మత్తులో సదరు ఆ డ్రైవర్ నిద్రిస్తున్నట్లు కనుగొన్నారు, దీంతో వారు కారుని తెరిచి ఆ డ్రైవర్ బాబుని మత్తు నుంచి మేల్కొల్పేరు. నిందితుని వద్ద మాదకద్రవ్యాలు లభించడంతో నిందితుడిని అరెస్టు చేసి మరింత విచారణ కోసం డ్రగ్స్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ కు పంపబడ్డాడు .
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!