రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు

- February 08, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు

28 కార్లు ఢీకొనడంతో 9 మంది గాయపడ్డ సంఘటన ఎమిరేట్స్‌ రోడ్డుపై చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్‌ విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచుతో రహదారి కన్పించక తొలుత ఓ యాక్సిడెంట్‌ జరగ్గా, యాక్సిడెంట్‌ జరిగిన వాహనాల్ని వెనకాల వచ్చిన మిగతా వాహనాలు ఢీకొన్నాయి. దేశవ్యాప్తంగా పొగమంచు ఏర్పడటంతో పలు చోట్ల యాక్సిడెంట్‌ గటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యాక్సిడెంట్‌ కారణంగా అబుదాబీ వైపుగా ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాహనదారులు పొగమంచుతో అప్రమత్తంగా వుండాలని, లో విజిబిలిటీ వున్నప్పుడు వాహనాల్ని వీలైనంత తక్కువ వేగంతో నడపాలని పోలీసులు సూచించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com