సందర్శకులను ఆకర్షిస్తున్న ఇండియన్ పెవిలియన్
- February 09, 2018
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా గౌరవ అతిథి దేశమైన భారతదేశ పెవిలియన్ (గుడారం) వారసత్వం సాంస్కృతిని ప్రతిభింబించే 32 వ జాతీయ ఉత్సవం రియాద్ సమీపంలో జనాద్రియ గ్రామంలో అత్యంత ఉత్సహబరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ ప్రాంతానికి సౌదీలు, ప్రవాసీయులతో సహా పలువురు సందర్శకులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. కింగ్ సాడ్ నుండి రెండు పవిత్ర మసీదుల రాజు సల్మాన్ వరకు అదేవిధంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుండి ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరకు చారిత్రాత్మక సందర్శనలకు సంబంధించిన అరుదైన ఫోటోల ప్రదర్శన ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా మారింది.సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన ద్వైపాక్షిక బంధాలను నొక్కిచెప్పే రాజు సల్మాన్ మాటలు మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది. భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కింగ్ సల్మాన్ బుధవారం ఈ పెవిలియన్ ను ప్రారంభించారు. సాంప్రదాయ జానపద నృత్యాలతో సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెవిలియన్ లోని థియేటర్ లో ప్రదర్శించబడుతున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







