భారత్‌-జోర్డాన్‌ మధ్య కీలక ఒప్పందాలు

- February 09, 2018 , by Maagulf
భారత్‌-జోర్డాన్‌ మధ్య కీలక ఒప్పందాలు

జోర్డాన్:పశ్చిమాసియా పర్యటనలో భాగంగా శుక్రవారం జోర్డాన్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి రాజు అబ్దుల్లా-2తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు. పాలస్తీనా సహా మూడు పశ్చిమాసియా దేశాల పర్యటన కోసం మోదీ.. జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌ చేరుకున్నారు. ''రాజుతో నా సమావేశం అద్భుతంగా సాగింది. మా చర్చలతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయి'' అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులో తాను భారత్‌లో చేపట్టబోయే పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రాజు పేర్కొన్నారు. ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. భారత ప్రధాని ఒకరు.. జోర్డాన్‌లో కాలుమోపడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. పాలస్తీనా వెళ్లడం కోసం అమ్మాన్‌లో మోదీ దిగారు.

తన విమానం దిగడానికి ఏర్పాట్లు చేసిన రాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ.. శనివారం పాలస్తీనా చేరుకుంటారు. భారత ప్రధాని ఒకరు ఈ దేశాన్ని సందర్శించడం గత 30 ఏళ్లలో ఇదే మొదటిసారి.

అనంతరం ఆయన యూఏఈ, ఒమన్‌లో పర్యటిస్తారు. ఆదివారం ప్రధాని.. దుబాయ్‌లో ఒక హిందూ దేవాలయ శంకుస్థాపన వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారు. ఒపేరా హౌస్‌లో భారత సంతతివారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడతారు. భారత విదేశాంగ విధానంలో గల్ఫ్‌, పశ్చిమాసియాకు కీలక ప్రాధాన్యం ఉందని పర్యటనకు బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రాంతంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడమే తన యాత్ర లక్ష్యమన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com