అరాఫ‌త్ స్మార‌కం వ‌ద్ద నివాళులు అర్పించిన మోడీ మోదీ

- February 10, 2018 , by Maagulf
అరాఫ‌త్ స్మార‌కం వ‌ద్ద నివాళులు అర్పించిన మోడీ మోదీ

మూడు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఇవాళ పాలస్తీనా చేరుకున్నారు. అక్కడ ఆయన రమల్లాలో ఉన్న యాసర్ అరాఫత్ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకముందు ప్రధాని మోదీకి.. సాంప్రదాయ గౌరవ వందనం లభించింది. రమల్లాకు విజిట్ చేసిన తొలి ప్రధాని మోదీ నిలిచారు. అబ్బాస్, మోదీలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. తన పాలస్తీనా పర్యటన చరిత్రాత్మకం అని మోదీ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com