మౌంటెయిన్స్‌లో తప్పిపోయిన జంటను రక్షించిన వాట్సాప్
- February 10, 2018
వాట్సాప్ మెసేజ్ ఓ జంటను రక్షించింది. రస్ అల్ ఖైమా మౌంటెయిన్స్‌లో ఆసియాకి చెందిన జంట తప్పిపోయింది. నార్త్ ఎమిరేట్స్‌లోని రఫ్ మౌంటెయిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తప్పిపోయిన జంట వద్దకు రికార్డ్ సమయంలో రెస్క్యూ టీమ్ మరియు అంబులెన్స్ చేరుకోవడం జరిగింది. హెడ్ ఆఫ్ సెక్షన్ మేజర్ తారిక్ మొహమ్మద్ అల్ షరామ్ మాట్లాడుతూ, మిస్సింగ్ కపుల్‌కి సంబంధించిన సమాచారం శుక్రవారం సాయంం 6 గంటల సమయంలో అందిందని అన్నారు. పారామెడిక్స్‌తో పాటు 7డుగురు సభ్యుల రెస్క్యూటీమ్ తక్షణం సంఘటనా స్థలానికి చేరుకుని, తప్పిపోయిన జంటను రక్షించిందని అన్నారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా లొకేషన్ని ట్రేస్ చేసి, వారిని రక్షించినట్లు తెలిపారు. బాధితులకు వెంటనే తక్షణ వైద్య సహాయం అందించారు. రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, టూరిస్టులు అలాగే కార్మికులు ట్రెక్కింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా వారు సంబంధిత అధికార వర్గాలకు సమాచారం అందించడమే కాకుండా, సరైన ట్రైనర్నీ, గైడ్నీ తమ వెంట పెట్టుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







