అంతర్జాతీయ వలసల సదస్సుకు మాజీ రాయబారి డా.వినోద్ కుమార్

- February 10, 2018 , by Maagulf
అంతర్జాతీయ వలసల సదస్సుకు మాజీ రాయబారి డా.వినోద్ కుమార్

ప్రాపంచిక వలసలకు సమగ్ర విధాన ప్రక్రియ' అనే అంశంపై ఐక్యరాజ్య సమితి వారు రూపొందించిన తుది ముసాయిదాపై *ఈనెల 11-12 న ఫిలిప్పీన్ దేశ రాజధాని మనీలా లో* జరుగుతున్న ఆసియా ప్రాంతీయ సదస్సుకు తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) సంస్థకు ఆహ్వానం అందింది. *మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా* అనే సంస్థ నిర్వహిస్తున్న ముఖ్యమైన ఈ సదస్సుకు *ప్రవాసి సంక్షేమ వేదిక పక్షాన మాజీ దౌత్యవేత్త డా. బిఎం వినోద్ కుమార్* హాజరవుతున్నారు. అనుభవము, యోగ్యత కలిగిన వారు ఈ అంతర్జాతీయ సమావేశంలో పాల్గొని సుదీర్గంగా చర్చించి ఓ సముచితమైన శాశ్వత పరిష్కారం కొరకు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. 

*డా. బిఎం వినోద్ కుమార్* నల్గొండ జిల్లాకు చెందినవారు. వృత్తిరీత్యా వైద్యులు (జనరల్ సర్జన్). ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) లో 1986 లో చేరిన ఆయన భారత విదేశాంగ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి 2015 లో రిటైర్ అయ్యారు. 1995-96 లో హైదరాబాద్ పాస్ పోర్ట్ అధికారిగా, 2010-12 లో ఢిల్లీ లోని విదేశాంగ శాఖ లో సంయుక్త కార్యదర్శిగా   పనిచేశారు. జర్మనీ, అల్జీరియా, మలేసియా, ఉజ్బేకిస్తాన్, అజర్ బైజాన్ దేశాలలోని భారత రాయబార కార్యాలలో వివిధ హోదాలలో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం అధ్యక్షులుగా సేవలందిస్తున్నారు. డా. వినోద్ కుమార్ ను అతని మొబైల్ & వాట్సప్  +91 77319 30131 ఇ-మెయిల్:  [email protected] ద్వారా సంప్రదించవచ్చు. 

ఇట్లు:  
*బిఎల్ సురేంద్రనాథ్*, ప్రధాన కార్యదర్శి, *తెలంగాణ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్* (తెలంగాణ ప్రవాసి సంక్షేమ వేదిక) (రి.నెం. 687/2013), హైదరాబాద్  సెల్: 98494 59956 & 98494 22622 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com