విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్ పరీక్ష తప్పనిసరి
- February 12, 2018
ఢిల్లీ : విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఎంబిబిఎస్ చదవాలనుకునే వారు సైతం ఇకపై నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)లో ఉత్తీర్ణులవడం తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అర్హులు మాత్రమే విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేలా నీట్‌ను తప్పనిసరి చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఏటా చైనా, రష్యా వంటి దేశాల్లో వైద్య విద్య అభ్యసించేందుకు దాదాపు 7 వేల మంది విద్యార్థులు భారతదేశం నుంచి వెళ్తున్నారు. వీరు ఎంబిబిఎస్ పూర్తి చేసి తిరిగొచ్చాక భారత్‌లో వైద్యునిగా పనిచేయాలంటే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్ల పరీక్ష ఎఫ్‌ఎంజిఇలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కానీ విదేశాల్లో వైద్య విద్య చదివి వచ్చిన వారిలో 12 నుంచి 15 శాతం మంది మాత్రమే ఎఫ్‌ఎంజిఇలో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మిగిలిన వారు అక్రమంగా వైద్యసేవలు అందించడం రోగుల ప్రాణులకు ముప్పుగా మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అర్హులైన వారు మాత్రమే విదేశాల్లో వైద్య విద్య అభ్యసించేలా నీట్ పరీక్షను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







