ఏక శిల శివాలయం... మిస్టరీగా గుడి కింద గుహలు
- February 13, 2018
అది ఆదిదేవుడి ఆలయం. వేల సంవత్సరాల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన మందిరం అది. కానీ దాని నిర్మాణంలో ఇసుక, సిమెంట్, ఇటుక, సున్నం, మట్టిలాంటి పదార్థాలు అస్సలు వాడలేదు. విచిత్రం ఏంటంటే...
ఆలయాలను పునాది నుంచి శిఖరం వరకు నిర్మిస్తారు. కానీ ఈ గుడిని మాత్రం రివర్స్‌లో కట్టారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఆ అద్భుత శివాలయం ఎక్కడుంది?
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఏరియాలో ఉన్న ఎల్లోరా గుహలు మిస్టరీగా మారాయి. ఈ గుహల్లో ఉన్న 32 టెంపుల్స్‌లో అత్యంత ముఖ్యమైంది శివాలయం. దీన్ని కైలాస్ లేదా కైలాసనాథ టెంపుల్‌గా పిలుస్తారు. ఈ గుడిని వర్ణించడానికి మాటలుగానీ, పదాలుగానీ సరిపోవు. వంద అడుగుల ఎత్తు రాతితో నిర్మించిన పురాతన అతి పెద్ద ఆలయాల్లో ఇది ఒకటి...
రథం ఆకృతిలో ఉన్న శివాలయం నిర్మాణానికి ఇటుకలు, ఇసుక, సున్నం, మట్టిలాంటి పదార్థాలు అస్సలు వాడలేదు. అందుకే ఈ గుడి నిర్మాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు... ఎప్పుడు పూర్తిచేశారు అని అంచనా వేయడం శాస్త్రవేత్తలకు సాధ్యపడడం లేదు. కానీ 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్ర కూట మహారాజు ఒకటవ క్రిష్ణ దీన్ని 756-773 సంవత్సరం మధ్యలో కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. పల్లవులు, చాళుక్యుల పాత్ర కూడా ఉన్నట్లు ఆలయ ఆర్కిటెక్చర్ వెల్లడిస్తోంది. ఏక శిలను తొలిచి శిఖరం నుంచి పునాది వరకు దీన్ని 18 ఏళ్లలోనే నిర్మించినట్లు అంచనా వేస్తున్నారు....
కానీ ఆనాటి నిర్మాణ కౌశలం, విజ్ఞానం... ఇప్పుడు మిస్టరీగా మారాయి. టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా 18 ఏళ్లలో నిర్మించడం సాధ్యం కాదు. మరి అప్పట్లో ఎలా సాధ్యమైందనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం... ఇప్పట్లో ఈ గుడిని చెక్కాలంటే... 18 ఏళ్లు ఏమాత్రం సరిపోవు. అందుకే అప్పట్లో దీని నిర్మాణాన్ని 200 ఏళ్లలో పూర్తిచేసినట్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఈ టెంపుల్ 1900 ఏళ్ల క్రితం నాటిదని, మరికొందరు 6000 ఏళ్ల నాటిదని భావిస్తున్నారు. ఏక శిలను తొలిచి శిఖరం నుంచి పునాది వరకు అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ రాతి శివాలయం... ఆర్కిటెక్చర్ పరంగా ఎంతో సుందరమైంది... ఉన్నతమైంది. దీన్ని తొలిచేటప్పుడు 5లక్షల టన్నుల రాళ్లు బయటపడినట్లు పురాతత్వవేత్తల అంచనా. దీని నిర్మాణం వెనుక దైవ శక్తుల ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు. వేదాల్లో వర్ణించిన భౌమాస్త్రంతో దీన్ని నిర్మించినట్లు ప్రతీతి. రాతి శివాలయంతో ఎన్నో రహస్యాలు ముడిపడివున్నాయి. ఈ గుడికింద గుహలు ఉండడం మిస్టరీగా మారింది. 1876లో ఇంగ్లాండ్‌కు చెందిన స్పిరిచ్చువలిస్ట్... హేమా హ్యాండ్రిగ్...ఒక పుస్తకం రాశారు. అందులో తన అనుభవాన్ని వివరించారు. ఆలయం కింద ఉన్న గుహల్లోకి వెళ్లొచ్చిన ఓ బ్రిటీషర్‌ను కలిశారట. అతడు కిందివరకు వెళ్లి అక్కడ మరో మందిరాన్ని చూశారట. అక్కడ మీటింగ్ పెట్టిన ఏడుగురు మహాపురుషుల్లో ఒకరు
అప్పటికప్పుడే ప్రత్యక్షం కావడం... అదృశ్యం కావడం చూశారట. ఈ పుస్తకం చదివిన తర్వాత చాలా మంది ఆలయం కింద ఉన్న గుహల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇప్పటికీ వాటిపై నిషేధం కొనసాగుతోంది. వీటి కింద ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నట్లు చెప్తున్నారు. మరి ఆ మిస్టరీ ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందా... అలాగే ఉండిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి