ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్‌లో ‘శివ’ సినిమా
- February 12, 2018
28 ఏళ్ళ క్రితం శివ సినిమాతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున, అమల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇప్పటి దర్శకులు కూడా ఆదర్శంగా తీసుకుంటారనేది వాస్తవం. అప్పట్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున సైకిల్ చైన్ లాగడం అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పవచ్చు. విమర్శకులు సైతం ఈ సినిమాని పొగడకుండా ఉండలేకపోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరోసారి వెండితెరపై ప్రదర్శించనున్నారట. ఫిబ్రవరి 18న హైదరాబాద్ పీవీఆర్‌లో ‘శివ’ సినిమా ప్రదర్శన జరుపుకోనుండగా, ఈ స్పెషల్ షోకు నాగార్జునతో పాటు అమల, దర్శకుడు వర్మ , నాగ్, వర్మ ఫ్యాన్స్ హాజరౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ్, వర్మ కాంబినేషన్‌లో కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ సినిమా ప్రమోషన్‌కి ఉపయోగపడేలా శివ సినిమా స్పెషల్ షో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఓన్ బ్యానర్ కంపెనీపై కాప్ డ్రామా తెరకెక్కుతుండగా, ఈ చిత్రం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ముంబై మోడల్ మైరా సరీన్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. సమ్మర్ కానుకగా సినిమా ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







