ఫలించిన భారత్ ఒత్తిడి.. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తించిన పాక్
- February 13, 2018
ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్ టార్గెట్‌గా భారత్ తెస్తున్న ఒత్తిడి ఫలించింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఆంక్షలు తప్పవనే సూచనలతో పాపి దిగొచ్చింది. ముంబై పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. ఈమేరకు యాంటి టెర్రరిజమ్ యాక్ట్ సవరణకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌పై పాక్ అధ్యక్షుడు హుస్సేన్ సంతకం చేశాడు. దీంతో.. హఫీజ్ సయీద్‌పైనే కాదు.. ఐక్యరాజ్య సమితి గుర్తించి ముష్కర మూకలన్నింటిపైనా వేటు పడింది.
జమాతుద్ దవా అనే ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా ఉన్నాడు.. హఫీజ్ సయీద్. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ఇన్నాళ్లు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను పోలీసులు తొలగించారు. దశాబ్దాలుగా హఫీజ్ సయీద్ పాకిస్తాన్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ప్రభుత్వాల్ని కీలుబొమ్మగా చేసి ఆడుకుంటున్న హఫీజ్.. పార్లమెంట్‌కు పోటీ చేసి.. సర్కార్‌లో భాగస్వామి కావాలనే భారీ స్కెచ్‌తో ముందుకెళ్తున్నాడు. అదే సమయంలో ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ని ఏకాకిగా మార్చగలిగింది.. భారత్. పాపికి అండగా నిలిచే అన్ని దేశాలతోను ఏదో రూపంలో సంప్రదింపులు జరిపింది. మోడీ గల్ఫ్ టూర్‌లోను టెక్నాలజీని అభివృద్ధి కోసం వాడుకోవాలి గానీ.. విధ్వంసాలకు కాదంటూ మోడీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







