జువ్వ మూవీ ఆడియో లాంచ్

- February 13, 2018 , by Maagulf
జువ్వ మూవీ ఆడియో లాంచ్

Juvva Movie Audio Function Photos
రంజిత్‌, పాలక్‌ లల్వాని నాయకానాయికలుగా త్రికోటి దర్శకత్వంలో సోమి ఫిలిమ్స్‌ పతాకంపై భరత్‌ సోమి నిర్మిస్తున్న జువ్వ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరిగింది. బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ విశిష్ట అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు వి.వి.వినాయక్‌ ఆడియో సీడీలను విడుదలచేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ, తమ్ముడి మీద అభిమానంతో హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత భరత్‌కు అభినందనలు. ఈ సినిమా ద్వారా రంజిత్‌కు హీరోగా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. అలాగే కీరవాణి సంగీతాన్ని అందించడం గొప్ప విషయం. తప్పకుండా సినిమా ప్రేక్షకులను అలరింపజేస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. 
దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ, దర్శకుడిగా నాకిది రెండో అవకాశం. నాలాంటి కొత్తవాడి సినిమాకు సంగీతాన్ని అందించిన కీరవాణి రుణం తీర్చుకోలేనిది. సినిమా మేము ముందు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువ అయ్యింది. కానీ ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా నిర్మాత ఎంతగానో సహకరించారు అని చెప్పారు. నిర్మాత భరత్‌ మాట్లాడుతూ, సినిమా చాలాబాగా వచ్చింది. రత్నంగారి డైలాగ్స్‌ బావున్నాయి. హీరోయిన్‌ పాలక్‌, విలన్‌ అర్జునా ఇద్దరూ మంచి నటనను కనబరిచారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.
సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ, త్రికోటి మొదటి సినిమా దిక్కులు చూడకు రామయ్యకు కూడా నేనే సంగీతాన్ని అందించాను. ఇది పక్కా కమర్షియల్‌ సినిమా. ప్రేక్షకులకు విందు భోజనం లాంటిది. అన్నిరకాల భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి. హీరో రంజిత్‌ డ్యాన్స్‌, ఫైట్స్‌ చాలాబాగా చేశాడు. హీరో రంజిత్‌ మాట్లాడుతూ, నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులకు, చిత్రబృందానికి కృతజ్ఞతలు. కథే ఈ చిత్రానికి హీరో. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని అన్నారు. రచయిత ఎం.రత్నం మాట్లాడుతూ, త్రికోటి నాకు చాలా ఏళ్లుగా తెలుసు. చాలా తెలివైన దర్శకుడు. అతనికి ఈ చిత్రం గుర్తింపును ఇస్తుందన్న నమ్మకం ఉంది. హీరో రంజిత్‌ అనుభవం ఉన్న నటుడిలా నటించాడు.
కీరవాణి అబ్బాయి భైరవ పాడిన ఓ కలా అనే పాట నాకు చాలా నచ్చింది అని అన్నారు. ఇంకా ఈ వేడు కలో నటులు అలీ, సప్తగిరి, నిర్మాత బి.వి.ఎస్‌. ఎన్‌.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com