సినీ నటుడు కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు
- February 13, 2018
ప్రముఖ సినీ నటులు కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు ప్రదానం చేశారు. శాలువా కప్పి స్వర్ణ కంకణధారణతో సత్కరించారు. శివరాత్రి పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం విశాఖ సాగర తీరంలో టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యాన శివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సత్యనారాయణకు ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు సుబ్బిరామిరెడ్డి, ఎంపి, సినీ నటుడు మురళీమోహాన్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు సత్కరించారు. స్థానిక కళాకారులకు శివశక్తి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ బృందంచే పౌరాణిక నాటకం, విజయనగరానికి చెందిన బిఎ.నారాయణ తదితరులచే సంగీత విభాహరి, వివిధ కళాకారులతో నృత్య ప్రదర్శనలు రంజింపచేశాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సిఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







