అకస్మాత్తుగా విమానం కుడి ఇంజిన్‌ను కప్పి ఉంచే కవచం ఊడి ఎగిరిపోయింది

- February 14, 2018 , by Maagulf
అకస్మాత్తుగా విమానం కుడి ఇంజిన్‌ను కప్పి ఉంచే కవచం ఊడి ఎగిరిపోయింది

విమానం ఇంజిన్‌ కవచం ఎగిరిపోయింది..

హోనోలులు : విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు ఓ ప్రమాదకర దృశ్యాన్ని చూసి ప్రయాణికులు హడలెత్తిపోయారు. విమానం ఇంజిన్లలో ఒకదాన్ని కప్పిఉంచే కవచం గాలికి ఎగిరిపోయింది. వెంటనే పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి హోనోలులుకు వెళ్తోంది. విమానం పసిఫిక్‌ మహాసముద్రంపై వెళ్తున్నప్పుడు.. అకస్మాత్తుగా విమానం కుడి ఇంజిన్‌ను కప్పి ఉంచే కవచం ఊడి ఎగిరిపోయింది. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇంజిన్‌ భాగాన్ని విమానంలోని ప్రయాణికులు చూసి ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి దాదాపు 370 మంది ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు ఎమర్జెన్సీ ప్రకటించి విషయాన్ని ఏటీసీకి తెలియజేశారు. అనంతరం సురక్షితంగా విమానాన్ని హోనోలులు ఎయిర్‌పోర్ట్‌లో దించారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది.

ఈ ఘటన అనంతరం పలువురు ప్రయాణికులు తమకెదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 'నా జీవితంలో అత్యంత భయానకమైన విమాన ప్రయాణం ఇది' అని మార్కెంటింగ్‌ కన్సల్టెంట్‌ అయిన మారియా పేర్కొంటూ ఇంజిన్‌కు చెందిన ఓ ఫొటోను ట్విటర్‌లో పెట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com