18 రాష్ట్రాల్లోని అటవీ సిబ్బందికి అపోలో వైద్యం
- February 14, 2018
ఫిలింనగర్, న్యూస్టుడే: అటవీ సిబ్బందికి వైద్యం అందించేందుకు అపోలో ఆస్పత్రి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కామినేని కొణిదల, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సీఓఓ కరణ్భల్లా తెలిపారు. ఫిలింనగర్ అపోలో ఆసుపత్రి ప్రాంగణంలో బుధవారం జరిగిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు ఉపాసన, కరణ్భల్లా ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం ఉపాసన మీడియాతో మాట్లాడుతూ అటవీ సిబ్బందికి వైద్య సదుపాయాలు కల్పించడం అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు. ఇటీవలే నల్లమల అడవుల్లో శిబిరాలు నిర్వహించామనీ, పదకొండు మంది మధుమేహ రోగులను గుర్తించామన్నారు. వారందరికీ అపోలో అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా 18 రాష్ట్రాల్లోని అటవీ గార్డులకు వైద్య శిబిరాలను నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రోగనిర్ధరణ చికిత్స సేవలను అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







