పర్వతారోహణలో జారి పడ్డ మహిళ
- February 15, 2018
మస్కట్: వాడి షాబ్‌లో పర్వతారోహణ సందర్భంగా ఓ మహిళ గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. చిన్నపాటి గాయాలతోనే ఆ మహిళ బయటపడిందని అధికారులు తెలిపారు. కొండ పైనుంచి కిందపడ్డ ఆమెను సురక్షితంగా తీసుకురావడంలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్స్ చాకచక్యంగా వ్యవహరించి, విజయం సాధించాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాధమిక చికిత్స చేశారు వైద్యులు. పర్వతారోహణ సందర్బంగా ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







