సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు హీరోగా..

- February 16, 2018 , by Maagulf
సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు హీరోగా..

తెలుగు పాటను పరుగులు తీయించిన సంగీత దర్శకులలో చక్రవర్తి ఒకరు. ఆయన తనయుడు 'శ్రీ' కూడా కొన్ని సినిమాలకి బాణీలను అందించి, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన అనారోగ్య కారణాల వలన చనిపోయారు. ఆయన కుమారుడు రాజేశ్ శ్రీ చక్రవర్తి హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు.
ఆయన హీరోగా 'శివ కాశీపురం' రూపొందుతోంది. సైకలాజికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో రాజేశ్ శ్రీ చక్రవర్తి జోడీగా ప్రియాంక శర్మ నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఆరంభించనున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com