షార్జాలో అసభ్య ప్రవర్తన: ముగ్గురికి జైలు

- February 16, 2018 , by Maagulf
షార్జాలో అసభ్య ప్రవర్తన: ముగ్గురికి జైలు

లైంగిక పరమైన అసభ్యతకు పాల్పడినందుకు గాను ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, డిపోర్టేషన్‌ని విధించింది. కల్బా పోలీసులకు అందిన సమాచారం మేరకు ముగ్గురు ఆసియాకి చెందిన వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు పురుషులు కాగా, ఓ మహిళ ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి కల్బాలోని మహిళ ఉన్న ఫ్లాట్‌కి ఓ యువకుడ్ని ఆహ్వానించారు. పోలీసులకు సమాచారం అందగానే, రెడ్‌ హ్యాండెడ్‌గా నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో మహిళలు, పురుషులు అసభ్యకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com