రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి
- February 16, 2018
రస్ అల్ ఖైమాలోని అల్ నయీమ్ సిటీ సెంటర్‌కి దగ్గరలో షేక్ రషీద్ రోడ్డుపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 66 ఏళ్ళ తండ్రి, 11 ఏళ్ళ కుమారుడు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో మృతుడి కుమారులు ఇద్దరున్నారు. రెండు కార్లు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఎమిరేటీ డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. రస్ అల్ ఖైమాసెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైదీ మాట్లాడుతూ, మధ్యాహ్నం 3.20 నిమిషాల సమయంలో ప్రమాదం గురించిన సమాచారం అందిందని అన్నారు. ట్రాఫిక్ పోలీస్, పెట్రోల్స్, అంబులెన్సెస్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని ఆయన వివరించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పిన ఆయన, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని పరిమిత వేగంతో వాహనాల్ని నడపాలని కోరారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







